మంచిర్యాల మమ్మల్ని పరీక్షించింది.. 45 డిగ్రీల మండే ఎండల్లో షూటింగ్‌పై సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-16 06:58:17  IST  )

మంచిర్యాల మమ్మల్ని అన్ని విధాలుగా పరీక్షించింది. ఎండ తీవ్రంగా ఉన్నా, ఆ వేడిలో, అలసటలో కూడా మా టీమ్ ఎక్కడా తగ్గకుండా పనిచేసింది.

మంచిర్యాల మమ్మల్ని పరీక్షించింది.. 45 డిగ్రీల మండే ఎండల్లో షూటింగ్‌పై సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘బ్లాక్ గోల్డ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలంగాణలోని మంచిర్యాలలో జరిగిన అత్యంత కఠినమైన షెడ్యూల్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సంయుక్త షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మంచిర్యాల ప్రాంతంలో వేసవి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. షూటింగ్ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉన్నాయని సంయుక్త తెలిపారు. "మంచిర్యాల మమ్మల్ని అన్ని విధాలుగా పరీక్షించింది. ఎండ తీవ్రంగా ఉన్నా, ఆ వేడిలో, అలసటలో కూడా మా టీమ్ ఎక్కడా తగ్గకుండా పనిచేసింది. సినిమా అనేది ఒకరి ప్రయాణం కాదు, ఎంతో మంది హృదయాలు, కష్టం కలిస్తేనే అది సాధ్యమవుతుంది. అలాంటి దృఢత్వం ఉన్న టీమ్‌లో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను" అని ఆమె రాసుకొచ్చారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు డీహైడ్రేషన్, ఎండదెబ్బ వంటి సమస్యలు రావడం సహజం. అయితే తనను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ, ముందుకు నడిపించిన తన వ్యక్తిగత బృందానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే హైదరాబాద్ నుండి పనులన్నింటినీ ఎంతో సునాయాసంగా చక్కబెట్టిన నిహారిక కొణిదెల మద్దతును ఆమె కొనియాడారు. దర్శకుడు యోగి తనపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన మార్గదర్శకత్వం మాటల్లో చెప్పలేనంత విలువైనవని సంయుక్త పేర్కొన్నారు. కష్టతరమైన షెడ్యూల్ ముగిసిన తర్వాత ఆమె నేరుగా తిరుపతి చేరుకున్నారు. "హైదరాబాద్ నుండి బయలుదేరినప్పుడు నాలో ఉన్న శక్తి కంటే, ఈ షెడ్యూల్ పూర్తయ్యాక నాలో రెట్టింపు శక్తి ఉంది. ప్రస్తుతం నేను తిరుమలలో ఉన్నాను. నా హృదయం నిండా కృతజ్ఞత తప్ప మరేమీ లేదు. దేవుడు ఇచ్చిన బలం మరియు ప్రజల ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైంది" అని సంయుక్త తన భావాలను పంచుకున్నారు. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాత్ర కోసం సంయుక్త పడుతున్న ఈ కష్టం చూస్తుంటే, ‘బ్లాక్ గోల్డ్’ ఆమె కెరీర్‌లో మరో భారీ హిట్ కావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

Mrunal Thakur: 63 ఏళ్ల ముసలాడితో నటించాలని చెప్పకుండా మోసం చేశారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన మృణాల్

Next Story