సర్దుకుపోయే రోజులు పోయాయి.. పెళ్లికి ముందే కలిసి ఉండాలంటూ మానస వారణాసి సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |

అప్పటి వారిలా సర్దుకుపోయే తత్వం ఇప్పటి వారిలో లేదు. అందుకే లివింగ్ రిలేషన్ వల్ల పెళ్లికి ముందే ఎదుటి వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన అర్థం చేసుకునే అవకాశం దక్కుతుంది

సర్దుకుపోయే రోజులు పోయాయి.. పెళ్లికి ముందే కలిసి ఉండాలంటూ మానస వారణాసి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి (Manasa Varanasi)ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో జోరు మీదున్న మానస, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె లివింగ్ రిలేషన్ షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుత కాలంలో మారుతున్న సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఏ బంధంలోనైనా ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉండటం చాలా ముఖ్యమని మానస పేర్కొంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి లివింగ్ రిలేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడింది.

పాత కాలంలో పెళ్లయ్యాక మాత్రమే ఒకరి స్వభావం మరొకరికి తెలిసేదని, దానివల్ల తెలియని ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చేదని ఆమె గుర్తు చేసింది. నేటి తరం యువత గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అప్పటి వారిలా సర్దుకుపోయే తత్వం ఇప్పటి వారిలో లేదు. అందుకే లివింగ్ రిలేషన్ వల్ల పెళ్లికి ముందే ఎదుటి వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన అర్థం చేసుకునే అవకాశం దక్కుతుంది’’ అని మానస చెప్పుకొచ్చింది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందే పసిగట్టవచ్చని ఆమె వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె మాటలకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా మానస వారణాసి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

Next Story