శివాజీ పై సంచలన కామెంట్స్ చేసిన ‘బిగ్‌బాస్ సీజన్- 5’ కంటెస్టెంట్!

by Disha Web Desk 9 |
శివాజీ పై సంచలన కామెంట్స్ చేసిన ‘బిగ్‌బాస్ సీజన్- 5’ కంటెస్టెంట్!
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 ప్రస్తుతం మా ఛానల్‌లో రికార్డు స్థాయి రేటింగ్స్‌ను దక్కించుకుంటుంది. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన సీజన్స్ కన్నా ఈ సీజన్‌కే ఎక్కువగా రేటింగ్స్ వస్తున్నాయి. రాత్రి 9 కాగానే కుటుంబంలోని సభ్యులంతా టీవీల్లో ముఖాలు పెట్టి.. అంతలా లీనమై చూస్తున్నారు. మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ప్రస్తుతం బిగ్‌బాస్ ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే..

బిగ్ బాస్ సీజన్-5లో టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచిన మానస్ తాజాగా శివాజీపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘‘ప్రతీ సీజన్‌లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు నేను రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను. కానీ ఈయన లాంటి కంటెస్టెంట్‌ను ఇప్పటివరకు చూడలేదు’’. అంటూ మానస్.. శివాజీ పై సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం మానస్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story