Mamta Kulkarni : ఒకప్పుడు బట్టలు లేకుండా తిరిగిన హీరోయిన్.. ఇప్పుడు యోగినిగా మారిపోయింది..

by Chukka Sudharani |   (  Updated:2023-07-11 10:54:10  IST  )

90లలో స్టార్ డమ్ సంపాదించిన బాలీవుడ్ బ్యూటీ మమతా కులకర్ణి.. దివ్య భారతికి దగ్గరి పోలికలుండటంతో ఆమె చనిపోయాక ఆ ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేసే చాన్స్ కొట్టేసింది.

Mamta Kulkarni : ఒకప్పుడు బట్టలు లేకుండా తిరిగిన హీరోయిన్.. ఇప్పుడు యోగినిగా మారిపోయింది..
X

దిశ, సినిమా : 90లలో స్టార్ డమ్ సంపాదించిన బాలీవుడ్ బ్యూటీ మమతా కులకర్ణి.. దివ్య భారతికి దగ్గరి పోలికలుండటంతో ఆమె చనిపోయాక ఆ ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేసే చాన్స్ కొట్టేసింది. అప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మమత.. కొద్ది రోజుల్లోనే కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారి లైఫ్ స్పాయిల్ చేసుకుంది. 1993లో స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్‌పై టాప్ లెస్‌గా దర్శనమిచ్చిన అమ్మడు.

అది చాలదన్నట్లు రెండేళ్ల తర్వాత ఒంటిపై బట్టలు లేకుండా కేవలం పెయింటింగ్‌తో మరోసారి కవర్‌పేజీపై కనిపించి వివాదాస్పదమైంది. ఇదిలా ఉంటే డ్రగ్ లార్డ్ విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకున్న ఆమెకు.. ఆ తర్వాత రూ. 2000కోట్ల ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్‌లో సంబంధం ఉన్నట్లు తేలడంతో అరెస్ట్ అయింది. అయితే 2010లో మొత్తానికి యోగినిగా మారిపోయిన మమతా కులకర్ణి.. ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిని’ పేరుతో ఆమె జీవితకథపై పుస్తకం రాసింది.

Read more: దేహమే నీ ఆస్తి అంటూ ఒంటిపై బట్టలు లేకుండా నిఖిల్ హీరోయిన్ రచ్చ.. వీడియో వైరల్

Next Story