లేడీ ఓరియెంటెడ్‌ కథలో మమిత.. భారీ రిస్క్ తీసుకోబోతున్న ప్రదీప్ రంగనాథన్!

by Mallepaka Hamsa |

ఇందులో మమితకు జోడీగా అశ్వత్ మరిముత్తు నటిస్తున్నారట. ఇక ఈ మూవీ కోసం యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథ్ నిర్మాతగా మారినట్లు టాక్.

లేడీ ఓరియెంటెడ్‌ కథలో మమిత.. భారీ రిస్క్ తీసుకోబోతున్న ప్రదీప్ రంగనాథన్!
X

దిశ, సినిమా: ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ సరసన ‘డ్యూడ్’ సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. మమిత బైజు ఒక సరికొత్త లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మమితకు జోడీగా అశ్వత్ మరిముత్తు నటిస్తున్నారట. ఇక ఈ మూవీ కోసం యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథ్ నిర్మాతగా మారినట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా చెన్నైలో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథ్ ప్రొడ్యూసర్‌గా మారడం భారీ రిస్క్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story