'మామ మశ్చీంద్ర' టీజర్ అవుట్

by Disha Web Desk 1 |
మామ మశ్చీంద్ర టీజర్ అవుట్
X

దిశ, వెబ్ డెస్క్: యువ హీరో సుధీర్ బాబు, హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు 'మామా మశీంద్ర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈరోజు టీజర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఆవిష్కరించారు. ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, షకలక శంకర్ కూడా టీజర్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ వినోదాత్మకంగా మరియు ఆసక్తికరంగా కనిపిస్తుంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. హర్ష వర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీపై ప్రొడక్షన్ నెం.5గా నారాయణ్ దాస్ కే.నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story

Most Viewed