టర్కీలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి.. ప్రియుడితో దిగిన బ్యూటీఫుల్ పిక్స్ వైరల్

by Disha Web Desk 10 |
టర్కీలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి.. ప్రియుడితో దిగిన బ్యూటీఫుల్ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ నటి మాళవిక రాజ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రియుడు, ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాతో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తాజాగా టర్కీలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వెల్లడిస్తూ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. తెల్లని వస్త్రధారణలో నవ దంపతులిద్దరూ చూడముచ్చటగా కనిపించగా.. బ్యాక్ గ్రౌండ్ లోకేషన్స్ నెటిజన్లను ఆట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక తన సంతోష క్షణాలను ఫ్యాన్స్‌తో ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ.. ‘మా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాం. చాలా కాలం తర్వాత మాకు సమయం కలిసొచ్చింది. మా బంధం మరింత బలంగా ముందుకు సాగుతోంది. అందరి ఆశీర్వాదాలు కావాలి’ అంటూ లవ్‌ సింబల్‌ ఎమోజీతోపాటు గోల్డ్‌ రింగ్‌ ఎమోజీని జత చేసింది. అయితే పెళ్లి ఎప్పుడనే విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచగా ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు పెద్దఎత్తున కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Read More: శంకర్ భారీ ప్లాన్.. ఊహలకు మించి ఉండనున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’!



Next Story

Most Viewed