- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Malavika Mohanan: నా లాంటి బాధ ఎవరికీ రావొద్దు.. రోజూ సెట్స్ లో ఐదుగురు డాక్టర్లు ఉండేవారు
నా లాంటి కష్టం, బాధ ఎవరికీ రావొద్దు.

దిశ,సినిమా : అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తంగలాన్ మూవీ అతి త్వరలో మన ముందుకు రానుంది. ఈ మూవీలో హీరోగా విక్రమ్ నటించగామాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కథానాయికలుగా చేస్తున్నారు. ఈ మూవీ నిజ జీవితాల ఆధారంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ పా.రంజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆగస్ట్ 15న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా ఈ మూవీలో చేసిన హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
" నాకు తెలియని విషయాలు ఈ సినిమా వల్ల చాలా తెలుసుకున్నాను. ఈ మూవీ షూటింగ్ చేసే సమయంలో ఎంత కష్ట పడ్డానో అది నాకు మాత్రమే తెలుసు. మేకప్ కోసం ఎవరైనా గంట మాత్రమే కేటాయిస్తారు కానీ, నేను నాలుగు గంటలు అదే పనిగా మేకప్ వేసుకునేదాన్ని.. ఒక పక్క ఎండలతో చెమటలు పడుతున్నా సరే నేను నా పని మాత్రం ఆపలేదు. దీని వల్ల నాకు స్కిన్ సమస్యలు కూడా వచ్చాయి. శరీరం పై దద్దుర్లు రావడంతో చాలా ఇబ్బంది పడ్డా .. నా లాంటి కష్టం, బాధ ఎవరికీ రావొద్దు.. రోజూ సెట్స్ లో నా కోసం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నాను" అంటూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చారు.






