Malli Pelli Movie on OTT :ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?

by Disha Web Desk 7 |
Malli Pelli Movie on OTT :ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నరేష్-పవిత్ర సహజీవనానికి దారితీసిన పరిస్థితులు, నరేష్ మూడో భార్య రమ్మ రఘుపతి వాళ్లిద్దరిని హోటల్ గదిలో పట్టుకోవడం దగ్గర నుంచి అన్ని విషయాలు ఈ మూవీలో చూపించారు. అయితే ఈ మూవీపై ప్రమోషన్స్ వీర లెవల్‌లో చేసినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఏ ఓటీటీలోకి వస్తుంది.. ఎప్పుడు వస్తుంది అనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ఫ్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు వచ్చిన ఆదరణ బట్టి ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నది మేకర్స్ డిసైడ్ చేస్తారు. కాగా.. ఈ మధ్యకాలంలో సినిమాలు యావరేజ్ టాక్ సొంతం చేసుకుంటే నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి ‘మళ్లీ పెళ్లి’ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed