సినిమాల్లోకి రాబోతున్న మల్లారెడ్డి.. తన బయోపిక్ తానే నిర్మిస్తానంటూ సంచలన ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-01 09:34:22  IST  )

నా జీవిత కథతో బయోపిక్ తీయాలని ఉంది. ఆ సినిమాను నేనే స్వయంగా నిర్మిస్తా.

సినిమాల్లోకి రాబోతున్న మల్లారెడ్డి.. తన  బయోపిక్ తానే నిర్మిస్తానంటూ సంచలన ప్రకటన
X

దిశ, సినిమా: తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీచ్‌లతో, మేనరిజమ్‌తో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే వ్యక్తి మల్లారెడ్డి. ఎడ్యుకేషనలిస్ట్‌గా, రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన ఆయన, ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన మల్లారెడ్డి.. తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం మల్లారెడ్డిని సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. "విలన్ పాత్ర చేయమని అడిగారు, కానీ నేను వద్దని చెప్పాను. విలన్ అంటే ఫస్ట్ హాఫ్ లో హీరోని తిట్టాలి, సెకండ్ హాఫ్ లో హీరో దగ్గర దెబ్బలు తినాలి. ప్రజల్లో, నా స్టూడెంట్స్ ముందు అలా హీరోతో కొట్టించుకోవడం నాకు అస్సలు నచ్చదు.

అందుకే ఆ పాత్రను రిజెక్ట్ చేశాను" అని తనదైన శైలిలో వివరించారు. సినిమాల్లోకి రావడం ఖాయమని చెబుతూనే, తన బయోపిక్ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. "నేను త్వరలోనే సినిమాల్లోకి వస్తా. నా జీవిత కథతో బయోపిక్ తీయాలని ఉంది. ఆ సినిమాను నేనే స్వయంగా నిర్మిస్తా. డైరెక్టర్ ఏ హీరో నా పాత్రకు సెట్ అవుతారని చెబితే వారినే పెడతాను. అలాగే ఆ సినిమాలో నేను కూడా ఒక పాత్రలో కనిపిస్తాను" అని మల్లారెడ్డి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మల్లారెడ్డి బయోపిక్ అంటే ఖచ్చితంగా అందులో ఆయన మార్క్ పంచ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విలన్ గా వద్దన్నా, ఏదైనా మంచి క్యారెక్టర్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, వెండితెరపై ఆయనను ఎప్పుడు చూస్తామా అని నెటిజన్లు వెయిట్ చేస్తున్నారు.

బాలకృష్ణ-కొరటాల శివ కాంబో ఫిక్స్.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మేకర్స్

Next Story