విజయ్ దేవరకొండ అంటేనే భయపడిపోతున్న హీరోయిన్ ?

by velandi.Saikiran |

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే..

విజయ్ దేవరకొండ అంటేనే భయపడిపోతున్న హీరోయిన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే.. పాపులర్ అయితే... మరి కొంతమంది.. పాపులర్ కావడానికి చాలా సమయం పడుతుంది. అయితే... హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె సినిమాలన్నీ బడా హీరోలతోనే చేశారు. 2013 సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలు అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. పేట, మాస్టర్, మారన్ లాంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు.

ఇక ఇప్పుడు... ది రాజా సాబ్ ( The Rajasaab) సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తోంది ఈ అందాల తార. ఈ సినిమా రొమాంటిక్ హారర్ గా వస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా చేస్తుండగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మాళవిక మోహనన్ ఒకరు.

అయితే... ప్రభాస్ తో సినిమా కంటే ముందే విజయ్ దేవరకొండ తో సినిమా చేశారట హీరోయిన్ మాళవిక మోహనన్. హీరో అనే టైటిల్ తో ఈ సినిమా వచ్చేదట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు 30% పూర్తయిన తర్వాత మధ్యలో ఆగిపోయిందట. కానీ అర్ధాంతరంగా ఈ సినిమాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా పూర్తి అయితే విజయ్ దేవరకొండ తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేది మాళవిక. హీరోయిన్ మాళవిక కారణంగానే ఈ సినిమా రద్దయినట్లు తెలుస్తోంది.

Next Story