ప్రభాస్‌‌ని అలా చూపించినందుకు మేకర్స్ సిగ్గుపడాలి.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 6 |
ప్రభాస్‌‌ని అలా చూపించినందుకు మేకర్స్ సిగ్గుపడాలి.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కె’. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ అమెరికా కామిక్ కాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉమైర్ సంధు తనను తాను సినీ క్రిటిక్‌గా అనుకుని సినీ సెలబ్రీటీలపై పలు ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అంతేకాకుండా పలు సినిమాల పోస్టర్లపై కూడా రివ్యూస్ ఇస్తుంటాడు.

తాజాగా, ప్రాజెక్ట్-కె ఫస్ట్ లుక్‌లపై ఉమైర్ సంచలన పోస్ట్ చేశాడు. ‘‘భారీ ట్రోలింగ్ తర్వాత, మేకర్స్ సోషల్ మీడియా నుండి ప్రాజెక్ట్-K ఫస్ట్ లుక్‌ని తొలగించారు! విపత్తు ప్రాజెక్ట్. 600 కోట్ల బడ్జెట్‌తో భారతదేశపు అత్యంత ఖరీదైన చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూడండి. ప్రభాస్‌ని రోబోటిక్ మంకీగా చూపించినందుకు మేకర్స్ సిగ్గుపడాలి’’ అంటూ రాసుకొచ్చాడు. దానికి ప్రభాస్ ప్రాజెక్ట్-కె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More: గూస్ బంబ్స్ తెప్పిస్తున్న ప్రభాస్ 'Project-K' ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

Next Story