- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవితేజ ‘RT-76’ అప్డేట్‌పై మేకర్స్ పోస్ట్.. టైటిల్ లీక్ కావడంతో ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఇటీవల ‘మాస్ జాతర’ చిత్రంతో వచ్చాడు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఇటీవల ‘మాస్ జాతర’ చిత్రంతో వచ్చాడు. పలు వాయిదాల తర్వాత అక్టోబర్ 31న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ అందుకోలేకపోయింది. ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ ‘RT -76’ సినిమాతో రాబోతున్నారు. కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సూధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. ఈ చిత్రానికి పలు టైటిల్స్ పెట్టే ప్లాన్‌లో మేకర్స్ ఫుల్ బిజీ అయిపోయినట్లు పలు వార్తలు వచ్చాయి.
తాజాగా, ఈ విషయంపై చిత్రబృందం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ నవంబర్ 10న 3:33గంటలకు విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఓ వైట్ బోర్డ్‌కు ఆనుకుని నిల్చున్న రవితేజ పోస్టర్‌ను షేర్ చేసి పప్పులో కాలేశారు. ఇందులో టైటిల్ క్లియర్‌గా అర్థమవుతోంది. ‘RT-76’ సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Vignapthi)అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు హింట్ ఇచ్చారు. కవర్ చేసినప్పటికీ అనుకోకుండా లీక్ అయిపోయింది. దీంతో అది చూసిన రవితేజ ఫ్యాన్స్ ఈ చిత్రం కూడా ‘మాస్ జాతర’లా వాయిదాలు వేయరుగా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






