‘గుంటూరు కారం’ ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. !

by Dishafeatures1 |
‘గుంటూరు కారం’ ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. !
X

దిశ, సినిమా : మహేష్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక అప్ డేట్.. టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒకే రోజు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

కాగా హైదరాబాద్ లో జనవరి 6న శనివారం రోజున ఈ ఈవెంట్ జరుగుతోంది. అయితే ఈ ఈవెంట్ లో మహేష్ బాబు సరికొత్త ట్రెండ్ ని సెట్ చేయబోతున్నాడు.. ఏంటంటే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ని అమెరికా థియేటర్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. కాలిఫోర్నియా సినీ లాంచ్ ప్రియాంక సెవెన్ సినిమాస్లో ఈ చిత్రానికి సంబంధించి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఫస్ట్ టైం ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇలా అమెరికాలో లైవ్ ఇవ్వడం జరుగుతోంది. మరిక ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు ఎవరు వస్తున్నారనేది ఆసక్తి కరంగా మారింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed