- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో పాన్ ఇండియా సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్..ఇక ఫ్యాన్స్ కు జాతరే?
మరో పాన్ ఇండియా సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సులు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఏజ్ పైబడినప్పటికీ.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. అయితే అలాంటి మహేష్ బాబు... వారణాసి తర్వాత మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారణాసి పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేసేందుకు మహేష్ బాబు సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే దీనిపై ఇప్పుడే అనుకోవడానికి ఏదీ లేదని.. దానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 2027లో రిలీజ్ కావాల్సి ఉంది. ఆ తర్వాత సలార్ 2, KGF 3 సినిమాలు కూడా చేయాలి ప్రశాంత్ నీల్. అదే సమయంలో ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తయిన తర్వాత మహేష్ బాబు- నీల్ కాంబినేషన్ లో సినిమా ఊహించుకోవచ్చని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అప్పటివరకు ఆగాల్సిందేనని చెబుతున్నాయి. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే, బ్లాక్ బాస్టర్ కావడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు.






