- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Babu: రీరిలీజ్‌లో సంచలనం సృష్టించిన మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా.. మొదటిరోజే ఆల్ టైమ్ రికార్డ్
కరోనా వచ్చిన పోయిన కానుంచి చాలామంది థియేటర్స్‌కు పోవడం లేదు. దీంతో ఈ సమయంలోనే ఇండస్ట్రీలోని పెద్దలు పలు చిత్రాలను ఓటీటీలోకి తీసుకొచ్చారు.

దిశ, సినిమా: కరోనా వచ్చిన పోయిన కానుంచి చాలామంది థియేటర్స్‌కు పోవడం లేదు. దీంతో ఈ సమయంలోనే ఇండస్ట్రీలోని పెద్దలు పలు చిత్రాలను ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇక దీంతో గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు విడుదలైన చిత్రాలనే మరోసారి థియేటర్స్‌లోకి తీసుకువచ్చినప్పటికీ రీరిలీజ్‌లోనూ ఎక్కువ కలెక్షన్లు రాబడుతుండటంతో మేకర్స్ ఆ ట్రెండ్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. ఇక ఇలా విడుదలైన సినిమాలు ఇంతకుముందు ఫ్లాప్ అయినప్పటికీ రెండుసారి థియేటర్స్‌లోకి వచ్చాక మాత్రం ఊహించని విధంగా హిట్‌గా నిలుస్తున్నాయి. ఇలా ఎన్నో చిత్రాలు భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి.
ఎంతోమంది స్టార్ హీరోల మూవీస్ ఇలా రీరిలీజ్‌లోనే దుమ్మురేపాయి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ మూవీ మే 30న రీరిలీజ్ అయింది. అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబోలో వచ్చిన మూవీ ‘ఖలేజా’(Khaleja). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రలో కనిపించారు. అయితే దీనిని శింగనమల రమేశ్, సి. కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2010లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి రావడంతో ఆయన అభిమానుల హడావిడి మామూలుగా లేదు. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఫస్ట్ డేనే ఏకంగా 8.26 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన సూపర్ స్టార్ అభిమానులు మా హీరో అంటే మామూలుగా ఉండదని బాక్సాఫీసు బద్దలు కావడం ఖాయమని అంటున్నారు. అయితే వీకెండ్ రాబోతుండటంతో ఈ కలెక్షన్లు మరింత పెరగనున్నాయి.






