ఆ హీరోయిన్‌తో మళ్లీ మళ్లీ నటించాలనిపిస్తోంది..మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Disha Web Desk 8 |
ఆ హీరోయిన్‌తో మళ్లీ మళ్లీ నటించాలనిపిస్తోంది..మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నటుడి సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫ్యాన్స్‌లో పూనకాలే మొదలవుతాయి. ఇక మహేష్ బాబు రీసెంట్‌గా నటించిన గుంటూరు కారం మూవీ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ నటుడు, ఎంతో మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాగా, ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, తనకు నచ్చిన ఫేవరెట్ హీరోయిన్ గురించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

కాగా, యాంకర్ మీకు నమ్రత, త్రిష, సమంత, కియార,రకుల్ ప్రీత్ సింగ్, శ్రీలీల వంటి స్టార్ బ్యూటీస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కదా, మీకు అందులో ఎవరితో మళ్లీ మళ్లీ నటించాలని పిస్తుంది. అని అడగ్గా, ఒక్కసారిగా షాకైన సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష అంటూ చెప్పుకొచ్చాడు. ఆమెతో స్క్రీన్ స్పేస్ బాగుంటుంది,అంతేకాకుండా తనతో సీన్స్ చాలా ఈజీగా నటించవచ్చు అంటూ తెలిపారు. అయితే ఆమెతో ఉన్న స్నేహం కారణంగానే అతను త్రిష పేరు చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక తర్వాత స్థానంలో సమంత ఉందంటూ చెప్పుకొచ్చాడు.

Read More..

పవన్ కల్యాణ్ ఆస్తులపై కన్నేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్!


Next Story