రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ రివీల్!

by Disha Web Desk 8 |
రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ రివీల్!
X

దిశ, సినిమా : స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా తీసిన బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర, బహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అందుకొని, అవార్డుల పంట పండిచాయి. అయితే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈయన ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఒక హిప్పీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. హిప్పీ అంటే దేశ దిమ్మర్లు, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉండేవారు. ఇలా తను తిరుగుతున్న ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో జనాలు ఎదురుకుంటున్న కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.



Next Story

Most Viewed