క్యాన్సర్ వల్ల కలిగే బాధను చెప్పా.. నేను మోసగత్తెని కాదంటూ మహేష్ బాబు బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఒకప్పటి హీరోయిన్ సోనాలి బింద్రే (Sonali Bendre)అందరికీ సుపరిచితమే.

క్యాన్సర్ వల్ల కలిగే బాధను చెప్పా.. నేను మోసగత్తెని కాదంటూ మహేష్ బాబు బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ సోనాలి బింద్రే (Sonali Bendre)అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఈ అందాల తార.. ఇండస్ట్రీకి దూరం అయింది. 2018లో క్యాన్సర్ రావడంతో చికిత్స తీసుకునేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చివరగా.. బాలీవుడ్‌ చిత్రంలో కనిపించింది. ఇక అప్పటినుంచి క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి క్యాన్సర్‌కు ప్రకృతి వైద్యం ఉపయోగపడుతుందని చెప్పి ట్రోల్స్‌కు గురవుతోంది. ఈ కామెంట్లను కొందరు వైద్యులు తప్పుపడుతున్నారు. అవి కాస్త వివాదానికి దారితీశాయి. తాజాగా, ఈ విషయంపై సోనాలి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఓ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘‘నేను ఎప్పుడూ డాక్టర్‌ని అని చెప్పలేదు. అలాగే మోసగత్తేని కూడా కాదు.. కానీ క్యాన్సర్ వస్తే నరకం అనుభవించాను. దాని వల్ల కలిగే భయం, నొప్పి బాధ అన్ని తెలుసు కాబట్టి మీ అందరికీ చెప్పాను. క్యాన్సర్లు అన్నింటికి ఒకే లాంటి లక్షణాలు కనిపించవు. చికిత్స కూడా వేరుగానే ఉంటుంది.

నా అనుభవాలను పంచుకుంటూ నేను తీసుకున్న వైద్యం గురించి చెబితే ట్రోల్ చేస్తున్నారు. నా వాటిని అంగీకరించమని పాటించమని మీకు చెప్పలేదు. ప్రతి వ్యక్తి తమకు సరైన సురక్షితమైన విధానాలనే పంచుకోవాలని కోరుకుంటున్నా. నేను నా ప్రయాణాన్ని నిజాయితీగా మీతో చెప్పాను కానీ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోకండి. నా బాధను చెప్పాను కానీ మీరు కూడా ప్రకృతి వైద్యం తీసుకోమని అనలేదు’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వివాదానికి కాస్త చెక్ పడినట్లు అయింది.

link

Next Story