మహేష్ బాబుకు ‘బిచ్చగాడు’ బాగా సెట్ అవుతుంది : విజయ్ ఆంటోని

by Disha Web Desk 9 |
మహేష్ బాబుకు ‘బిచ్చగాడు’ బాగా సెట్ అవుతుంది : విజయ్ ఆంటోని
X

దిశ, సినిమా: దాదాపు 6 ఏళ్ల తర్వాత ‘బిచ్చగాడు’ చిత్రానికి సీక్వెల్‌తో విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరల్డ్ వైడ్‌గా ‘బిచ్చగాడు 2’ మూవీ మే 19న రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా విజయ్ ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సిరీస్‌లో మీరు కాకుండా హీరోగా ఎవరు చేస్తే బాగుంటుందనుకుంటున్నారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీంతో ‘‘బిచ్చగాడు’ చిత్రం మహేష్ బాబుకు బాగా సెట్ అవుతుంది. ఒకవేళ నేను నటించకపోతే సరైన హావ భావాలు, ఎమోషన్ పండించాలంటే మహేష్ సెట్ అవుతాడు. తమిళంలో విజయ్, అజిత్ బెటర్ ఆప్షన్’ అని విజయ్ ఆంటోని తెలిపాడు.

Also Read..

ఫాతిమా, విజయ్.. ‘బిచ్చగాడు 2’ ప్రాణం పెట్టి తీశారు : ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అడివి శేష్‌

Next Story

Most Viewed