ఇండస్ట్రీ నుంచి అయినా తప్పుకుంటా కానీ.. అలాంటి పాత్రలో నటించను : మహేష్ బాబు

by Disha Web Desk 10 |
ఇండస్ట్రీ నుంచి అయినా తప్పుకుంటా కానీ.. అలాంటి పాత్రలో నటించను : మహేష్ బాబు
X

దిశ,సినిమా: సాధారణంగా సెలబ్రిటీస్ ఎలాంటి వీడియోస్ పెట్టినా నిముషాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇచ్చిన పాత ఇంటర్వ్యూ వీడియోస్ బాగా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీస్ క్లిప్స్ ను కావాలని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు .. కెరియర్ మొదటి నుంచి ఇప్పటి వరకు చిన్న రూమర్ కూడా రాలేదు. మహేష్ బాబు ఎలాంటి పాత్రలు ఎంచుకుంటాడో మనకు తెలిసిందే. అయితే, ఇంత వరకు ఎక్కడా కూడా మహేష్ బాబు టూ బోల్డ్ గా ఉన్న పాత్రలు చేయలేదు. మొదటి నుంచి మహేష్ బాబుకి అలాంటి పాత్రలు అసలు నచ్చవట.

కొద్దీ కాలం క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీడియా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు చాలా బోల్డ్ గా జవాబు ఇచ్చారు. ఒకవేళ అలాంటి పాత్రలే చేయాల్సి వస్తే, సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటాను.. కానీ నా లిమిట్స్ నేను ఎప్పుడూ క్రాస్ చేయను.. అసలు ఆ పాత్రలో కూడా నటించను .. నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి.. వాటిని ఎవరి కోసం దాటనంటూ చెప్పుకొచ్చాడు.

Read More..

సిద్దార్థ్, అదితిరావు హైదరి ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే?


Next Story

Most Viewed