- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంలో ఉన్న సినిమాకు రివ్యూ ఇచ్చి చిక్కుల్లో పడిన సూపర్ స్టార్..
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par). ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో జెనీలియా, అరోష్ దత్తా, గోపీ కృష్ణన్ వర్మ(Gopi Krishnan Varma), రిషి షహాని,రిషబ్ జైన్,వేదాంత్ శర్మ, వంటి వారు కీలక పాత్రలో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల క్రమంలో.. పలు వివాదాలు ఏర్పడ్డాయి. దీనిని యూట్యూబ్‌లోకి తీసుకురాబోతున్నారంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఆమిర్ ఖాన్‌పై విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి ఆమిర్ ఖాన్ స్పందించలేదని అలాంటి ఆయన సినిమాను బ్యాన్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఆయనను దారుణంగా తిట్టారు. ఇక ఇలాంటి సమయంలోనే ‘సితారే జమీన్ పర్’ జూన్ 20న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీ పాజటివ్‌టాక్‌తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఆమిర్ ఖాన్ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. ‘‘అద్భుతమైన చిత్రం. ఆమిర్ ఖాన్ ఇతర క్లాసిక్ సినిమాల్లాగానే సితారే జమీన్ పర్ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది. ఏడిపిస్తుంది..చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ మూవీ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు వివాదంలో ఉన్న నటుడు సినిమాపై రివ్యూ ఇవ్వడం అవసరమా అని పలు రకాలుగా స్పందిస్తున్నారు. అలాగే కొంతమంది మహేష్ బాబును తిడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ ట్వీట్‌కు ఎంత తీసుకున్నావ్ అని అంటున్నారు.






