‘మేడిన్ హెవెన్’ సీజన్ 2 ట్రైలర్

by Dishanational2 |
‘మేడిన్ హెవెన్’ సీజన్ 2 ట్రైలర్
X

దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా వచ్చిన హిట్ వెబ్ సిరీస్‌లో ‘మేడిన్ హెవెన్’ ఒకటి. తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్ ‘మేడిన్ హెవెన్ సీజన్ 2’ కూడా రాబోతుంది. ఇక సీజన్ 1లో కనిపించిన నటీనటులే రెండో సీజన్‌లో ఉన్నారు. శోభిత, అర్జున్‌తో పాటు జిమ్ సర్బా, కల్కి కొచ్లిన్, శశాంక్ అరోరా, శివాంగీ రస్తోగి లాంటి వాళ్లు సీజన్ 2లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో మృణాల్ ఠాకూర్, రాధికా ఆప్టే, శిబానీ దండేకర్, సారా జేన్ డయాస్ లాంటి వాళ్లు పెళ్లి కూతుళ్ల పాత్రలో కనిపించారు. మొత్తం ట్రైలర్ చూస్తుంటే ఈ రెండో సీజన్ కూడా ఫుల్ డ్రామా, ఎమోషనల్, రొమాన్స్‌తో నిండిపోయినట్లు అర్థమవుతుంది. జోయా అక్తర్, రీమా కగ్టి, అలంకృత శ్రీవాస్తవ, నీరజ్, నిత్య మెహ్రా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఆగస్టు 10న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Read More: రాత్రి అయితే అమ్మాయిగా పడకలోకి.. పగలంతా అబ్బాయిగా జల్సా

Next Story

Most Viewed