- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదంటూ క్షమాపణలు చెప్పిన మాధవన్..
దశమ్ గ్రంథ్‌లోని లైన్లు చెప్పేటప్పుడు నేను సిగరెట్ తాగానని కొందరు భావిస్తున్నారు, కానీ అది నిజం కాదు.

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఫిల్మ్ ‘ధురంధర్: ది రివెంజ్’ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో హీరో ఆర్ మాధవన్ పోషిస్తున్న ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్ పాత్రకు సంబంధించిన ఒక సీన్ ఇప్పుడు సిక్కు కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. శివసేన (షిండే వర్గం) నాయకుడు గుర్జీత్ సింగ్ ఖేర్, ముంబైలోని ములుండ్ పోలీస్ స్టేషన్‌లో ఈ సినిమాపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ముదిరింది. తాజాగా, ఈ వివాదంపై హీరో ఆర్ మాధవన్ వివరణ ఇచ్చారు. ‘‘ధురంధర్ కుటుంబం తరపున మాకు ఇంత ప్రేమను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఒక సీన్ విషయంలో కొందరు బాధపడుతున్నారని మాకు తెలిసింది.
దశమ్ గ్రంథ్‌లోని లైన్లు చెప్పేటప్పుడు నేను సిగరెట్ తాగానని కొందరు భావిస్తున్నారు, కానీ అది నిజం కాదు. దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ డైలాగ్స్ చెప్పడానికి చాలా ముందే సిగరెట్ ఆర్పేయమని ఆయన నాకు స్పష్టంగా చెప్పారు. మీరు సీన్ జాగ్రత్తగా గమనిస్తే, నేను ఆ లైన్లు చెప్పేటప్పుడు నా నోటి నుంచి పొగ రాదు, నా చేతిలో సిగరెట్ ఉండదు, ఫ్రేమ్‌లో ఎక్కడా పొగ కనిపించదు. మేము సిక్కు కమ్యూనిటీని ఎంతో గౌరవిస్తాం. నేను ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు. దయచేసి ఎవరైనా బాధపడితే క్షమించండి" అని మాధవన్ క్లారిటీ ఇచ్చారు. తన పాత్ర చైన్ స్మోకర్ కాబట్టి సీన్ మొదట్లో సిగరెట్ ఉండవచ్చని, కానీ పవిత్ర శ్లోకాలు వచ్చే సమయానికి దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు ఆయన స్పష్టం చేశారు.






