ఫహద్ ఫాసిల్ ‘మారీసన్’ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు.

ఫహద్ ఫాసిల్ ‘మారీసన్’ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తెలుగులో ఆయన ‘పుష్ప-2’ మూవీలో విలన్‌గా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫహాద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మారీసన్’(Mareesan). సుధీష్ శంకర్(Sudhish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరీ(RB Chowdhury) నిర్మిస్తున్నారు. ఇందులో ఫహాద్ ఫాజిల్, వడివేలు(Vadivelu) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వివేక్ ప్రసన్న, రేణుక, సితార కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 2025 జూలైలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. తాజాగా, ఫహాద్ ఫాజిల్ ‘మారీసన్’ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఈ మూవీ ట్రైలర్ జూలై 14న సాయంత్రం 5:04 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే బైక్‌పై ఓ బ్యాక్ వేసుకుని వడివేలుతో జాలీగా వెలుతున్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘వేచి ఉండటం ముగుస్తుంది, మాయాజాలం ప్రారంభమవుతుంది’’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఫహాద్ షేర్ చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

link

Next Story