రొమాన్స్ చేయడమంటే ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన Krithi Shetty!

by Disha Web Desk 9 |
రొమాన్స్ చేయడమంటే ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన Krithi Shetty!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ ‘కృతి శెట్టి’. ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, వారియర్’ లాంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ భామకు బోల్డ్ సీన్లపై ఓ ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నాకు యాక్షన్ సన్నివేశాలు చేయడం కన్నా.. రొమాంటిక్ సీన్లలో నటించడమంటేనే ఎక్కువ ఇష్టం.’’ అంటూ చాలా ధైర్యంగా బదులిచ్చింది యంగ్ బ్యూటీ. దీంతో నెటిజన్లు ‘నువ్వు చేసిన మూడు సినిమాల్లో ఓ రేంజ్ ముద్దులిచ్చావ్, రొమాన్స్ చేశావ్. అవి సూపర్ హిట్ అయ్యాయి. మిగతా మూడు చిత్రాల్లో రొమాంటిక్ సీన్లు చేయలేదు. అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట కృతిశెట్టి సినిమాల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed