- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ మధురత్వాన్ని కనుగొంటుంది.. ‘చాయ్‌వాలా’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన తేజు అశ్విని
టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి(Shiva Kandukuri), ప్రమోద్ హర్ష(Pramod Harsha) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘చాయ్ వాలా’(Chai Wala).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి(Shiva Kandukuri), ప్రమోద్ హర్ష(Pramod Harsha) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘చాయ్ వాలా’(Chai Wala). హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో శివ సరసన తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ మేకర్స్ ఆసక్తిని పెంచుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘చాయ్ వాలా’ చిత్రబృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసినట్లు తేజు అశ్విన్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘సఖిరే’ మెలోడీ సాంగ్ ప్రొమో రిలీజ్ చేసింది. ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 11న సాయంత్రం 5గంటలకు రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ పోస్ట్‌కు ‘‘ప్రేమ తన మధురత్వాన్ని కనుగొంటుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది.






