లోకేష్ కనగరాజ్ భారీ ప్లాన్‌..ప్ర‌భాస్‌-ప‌వ‌న్ తో మూవీ ?

by velandi.Saikiran |

లోకేష్ కనగరాజ్ భారీ ప్లాన్‌. పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ ఇద్దరినీ కలిపి ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.

లోకేష్ కనగరాజ్ భారీ ప్లాన్‌..ప్ర‌భాస్‌-ప‌వ‌న్ తో మూవీ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీసు బద్దలు కావాల్సిందే. మా నగరం, కైతి, మాస్టర్, విక్రమ్, లియో లాంటి ఎన్నో బంపర్ హిట్ సినిమాలు తీశాడు లోకేష్ కనగరాజ్. ఇక ఇటీవల కూలీతో మెరిసి దుమ్ము లేపాడు. అయితే అలాంటి లోకేష్ కనగరాజ్ అదిరిపోయే ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన నేరుగా తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట. దాని కోసం ప్రత్యేకంగా ఒక కథ రాసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ ఇద్దరినీ కలిపి ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. మొదటగా ఈ సినిమా కథను రజనీకాంత్ తో పాటు కమల్ హాసన్ ను పెట్టి తీయాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో తెలుగు హీరోలు పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో చేసేందుకు లోకేష్ కనగరాజ్ సన్నాహాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేసేందుకు లోకేష్ స్కెచ్ వేశారట. దీనికి పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. నిజంగానే ఈ ప్రాజెక్టు ఓకే అయితే ఇండస్ట్రీని లోకేష్ దున్నేస్తాడని అంటున్నారు.

Next Story