- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aamir Khan: లోకేష్ కనగరాజ్‌తో భారీ ప్రాజెక్ట్.. కన్ఫార్మ్ చేస్తూ స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఎస్ ప్రసన్న కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే ఇందులో జెనీలియా కీలక పాత్రలో నటిస్తోంది. దీనిని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 20న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మూవీతో పాటు ఆమిర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాభారతం’(MahabharataM) లోనూ నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా, ఆమిర్ ఖాన్ మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఆయన ఓ మూవీ చేయనున్నట్లు వెల్లడించారు.
‘‘అవును నేను లోకేష్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాము. సూపర్ హీరో జానర్‌లో ఈ కథ ఉంటుంది. భారీ స్థాయిలో యాక్షన్ మూవీగా దీనిని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది జూన్ తర్వాత ఈ మూవీ పట్టాలెక్కించాలనుకుంటున్నాం. ప్రస్తుతం తానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంతకుమించి ఏమీ చెప్పలేను. రెండేళ్ల తర్వాత దీని గురించి చర్చించుకుందాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, లోకేష్ కనగరాజ్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు.






