కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన లోకేష్.. ఈ సమయంలో అవసరమా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కూలీ’(coolie).

కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన లోకేష్.. ఈ సమయంలో అవసరమా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కూలీ’(coolie). ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్, పూజా హెగ్డే, ఆమిర్ ఖాన్(Aamir Khan) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇటీవల ఇందులోంచి వచ్చిన పవర్ హౌస్ సాంగ్, మేనికా పాట సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేసింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతీ పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

దీంతో సినీ ప్రియులు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే.. మూవీ మేకర్స్ ట్రైలర్ ఆగస్టు-2న రాబోతున్నట్లు జులై 28న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. దానికి కారణం ఏంటంటే.. హాలీవుడ్ సినిమా ‘మాడ్ ఆమె వెబ్’ పోస్టర్‌ను కాపీ పేస్ట్ చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. కాపీ కొట్టి లోకేష్ కనగరాజ్ అడ్గంగా దొరికిపోయాడని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఇలా చేయడం అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు.

link

Next Story