‘లోకా: చాప్టర్1’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ విడుదల

by Mallepaka Hamsa |

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కొనసాగుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది.

‘లోకా: చాప్టర్1’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ విడుదల
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కొనసాగుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాలు కూడా కేవలం నాలుగువారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. దీంతో జనాలు సైతం థియేటర్స్‌కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక దర్శక నిర్మాతలు తమకు నష్టాలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ జనాలు మాత్రం పైరసీలో, ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ఒకటి ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. మలయాళ సినిమా ‘లోకా:చాప్టర్1చంద్ర’ (Lokah:Chapter 1Chandra)ఆగస్టు 28న థియేటర్స్‌లోకి వచ్చి రికార్డులు తిరగరాసింది.

బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి ఇది పండగలాంటి వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోకా: చాప్టర్1’ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా.. కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లీన్ (Nusleen)కాంబోలో వచ్చిన ‘లోకా:చాప్టర్1’ అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.

Next Story