- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మయోసైటిస్‌తో నేనూ బాధపడ్డాను.. స్టార్ హీరోయిన్ Pia Bajpiee
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆమె కోలుకోవాలని,

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆమె కోలుకోవాలని, నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు. రీసెంట్‌గా సమంతలాగే తాను కూడా మయోసైటిస్‌తో బాధపడ్డానంటూ హీరోయిన్ పియా బాజ్‌పేయ్ షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ''2016లో అనుకుంటా.. ఒకసారి నా కాళ్లు మొత్తం వాపు వచ్చాయి. జిమ్‌లో ఏదైనా దెబ్బ తగిలిందేమో అనుకున్నాను. కానీ మరుసటి రోజు నిద్ర లేచేసరికి రెండు కాళ్లు కూడా వాచాయి. నొప్పితో కూర్చోవడం, నిల్చోవడం చేయలేకపోయాను. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాను. ఈ వ్యాధి గురించి మొదట డాక్టర్ నాకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించారు. అప్పటికీ నేను ముంబైలో ఒంటరిగానే ఉంటున్నాను. భయపడతారేమోనని మా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం చెప్పలేదు. భవిష్యత్ ఏమైపోతుందోనని చాలా భయపడ్డాను. మనసులోనే కుమిలిపోయాను. ఇక సమంతకు మయోసైటిస్ ఉందని తెలిసినప్పుడు కూడా చాలా బాధపడ్డాను. నేను తన పరిస్థితిని అర్థం చేసుకోగలను. సామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది పియా బాజ్‌పేయ్.
ఇవి కూడా చదవండి:
అండర్‌వేర్ లేకుండా బటక్స్ చూపించిన నటి.. బ్లూ ఫిల్మ్ కోసమేనంటూ
- Tags
- Pia Bajpiee






