- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెనిన్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్
రెండేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’(Lenin).

దిశ, సినిమా: రెండేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’(Lenin). మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘వారెవా వారెవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు అభిమానులు, మ్యూజిక్ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ తమ వాయిస్‌తో పాటకు ఓ ఎమోషనల్ ఫీల్‌ను తీసుకొచ్చారు. మ్యూజికల్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.






