‘నాటు నాటు’ పాటకు తోలు బొమ్మ స్టెప్పులు.. చూస్తే వావ్ అనాల్సిందే: ఆనంద్ మహీంద్రా ట్వీట్

by Disha Web Desk 7 |
‘నాటు నాటు’ పాటకు తోలు బొమ్మ స్టెప్పులు.. చూస్తే వావ్ అనాల్సిందే: ఆనంద్ మహీంద్రా ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ క్రమంలో దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా.. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఊగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ‘నాటు నాటు’ పాటకు తోలు బొమ్మ ప్రదర్శన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అంతే కాకుండా ఈ తోలు బొమ్మ డాన్స్ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘‘ఒకే ఒక లాస్ట్ ట్వీట్. ‘నాటు నాటు’ పాటపై నేను ఒక హామీ ఇస్తున్నాను. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని తన తీగలపై కలిగి ఉంది’’ అనే క్యాప్షన్ ఇచ్చి ట్వీట్ చేశారు. కాగా.. రెండు నిమిషాల ఈ తోలు బొమ్మ ప్రదర్శనను చూస్తే వావ్ అనాల్సిందే.

Next Story

Most Viewed