తెలుగు అమ్మాయిలకు సినీ రంగంలో అసలు గుర్తింపు లేదు : Chandini Chowdary

by Dishafeatures1 |
తెలుగు అమ్మాయిలకు  సినీ రంగంలో అసలు గుర్తింపు లేదు : Chandini Chowdary
X

దిశ, సినిమా: చాందిని చౌదరి గురించి పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో చిన్న చిన్న షార్ట్ ఫిలిం చేసుకుంటూ.. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. త్వరలో విశ్వక్ సేన్ అఘోరాగా నటిస్తున్న ‘గామీ’ సినిమాతో రాబోతుంది. విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాందిని చౌదరి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్ చేసింది.

‘ నేను మూవీ కథలు విన్నప్పుడు అంత తొందరగా ఓకే చెప్పెను టైం తీసుకుంటాను. కానీ ఈ ‘గామి’ కథ విన్నప్పుడు తప్పకుండా అందులో భాగం కావాలనిపించింది. ఈ మూవీ మొత్తం వారణాసి, కుంభమేళ, కశ్మీర్‌, హిమాలయాల్లోని రియల్‌ లోకేషన్స్‌లో షూట్‌ చేశారు.నాకు ఈ సినిమా ప్రయాణం అంతా ఓ సాహస యాత్రలా సాగింది. టీం అంతా ఐదేళ్ల పాటు ఈ మూవీ కోసం శ్రమించాం. ఐమాక్స్‌ స్క్రీన్‌లో ట్రైలర్‌ చూసినప్పుడు మేం పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందనే భావన కలిగింది.

నటిగా నా పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. జయాపజయాలతో సంబంధం లేకుండా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. మన పనిలో సాగిపోవాలనే సత్యాన్ని తెలుసుకున్నా. కానీ సినిమా రంగంలో తెలుగు అమ్మాయిలకు గుర్తింపు లేదనే వార్తను వింటూనే ఉన్నా. ఇక ఇన్నేళ్లకు ఓ తెలుగు అమ్మాయిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. అని జోనర్స్‌ సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది నేను నటించిన నాలుగు సినిమాలు రాబోతున్నాయి’ అని చాందిని చౌదరి తెలిపింది.

Read More..

నా యాక్టింగ్ రోల్ మోడల్ అతనే.. ఇప్పుడు బీస్ట్‌గా అయ్యాడంటూ సమంత ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

Next Story

Most Viewed