పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్

by Disha Web Desk 6 |
పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అలరించింది. అయితే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లిచేసుకోబోతుందని సోషల్ మీడియాలో నిత్యం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరి ఎంగే‌జ్మెంట్ కూడా జూన్-9న ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారట. అతి తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్ధం జరిపించి పెళ్లి గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేసుకున్నారని టాక్. పెళ్లి వార్తలపై ఇప్పటి వరకూ అటు మెగా ఫ్యామిలీ, లావణ్య అధికారికంగా స్పందించలేదు. తాజాగా, లావణ్య త్రిపాఠి మేకప్ లేకుండా ఉన్న ఫొటోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘సూర్య కిరణాలలో కూర్చున్నా’’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటోలలో అక్కడక్కడా లావణ్యకు తెల్ల వెంట్రుకలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు వరుణ్ తేజ్ ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More... సంప్రదాయ దుస్తుల్లో రెబల్ స్టార్‌ ప్రభాస్‌.. పోటీపడ్డ అభిమానులు


Click Here for Instagram link






Next Story

Most Viewed