ఘనంగా మెగా వారసుడి నామకరణం.. ఫొటోలు రివీల్ చేస్తూ లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-03 14:44:29  IST  )

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే.

ఘనంగా మెగా వారసుడి నామకరణం.. ఫొటోలు రివీల్ చేస్తూ లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న మెగా కోడలు లావణ్య త్రిపాఠి పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. వారసుడి రాకతో మెగా కుటుంబంలో సంబురాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో దాదాపు అందరికీ ఆడపిల్లలే పుట్టగా.. వరుణ్‌ తేజ్‌కు మాత్రం కొడుకు పుట్టాడు. దీంతో అంతా చాలా సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే అందరిలాగానే తమ బాబు ముఖాన్ని మాత్రం మెగా కపుల్ సీక్రెట్‌గా ఉంచుతున్నారు. బాబు మూఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మెగా ఇంట్లో బుల్లి వారసుడి నామకరణం వేడకలు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 3వ తేదీన ఈ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగా కుటుంబం ఎక్కడా షేర్ చేయలేదు. కానీ. లావణ్య-వరుణ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా కొడుకు పేరును రివీల్ చేస్తూ ఫోస్ట్ పెట్టారు. తమ కుమారుడికి తాము ఎంతగానే పూజిస్తున్న ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఆయన పేరు కలిసేలా ‘వాయువ్ తేజ్ కొణిదెల’ (Vaayuv Tej Konidela)పెట్టుకున్నారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ కుమారుడితో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. కానీ అందులో ఆ బాబు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు పేరు సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే బాబు ముఖాన్ని చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూతురు ‘క్లిన్‌కారా’ విషయంలో చేసినట్లు చేయొద్దని అంటున్నారు. ఆ పాప పుట్టిన రెండేళ్లు అవుతున్నప్పటికీ షేస్ మాత్రం రివీల్ చేయకపోవడం గమనార్హం.

Next Story