గుడ్ న్యూస్ ప్రకటించిన లావణ్య త్రిపాఠి..ఇన్‌స్టా పోస్ట్‌తో అంతా షాక్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

గుడ్ న్యూస్ ప్రకటించిన లావణ్య త్రిపాఠి..ఇన్‌స్టా పోస్ట్‌తో అంతా షాక్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత నుంచి సినిమాలకు దూరం ఉంటుంది. ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ‘సతీ లీలావతి’ మూవీని ప్రకటించింది. పలు అప్డేట్స్ విడుదలైనప్పటికీ రిలీజ్ తేదీ రాలేదు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగానే.. లావణ్య తాను తల్లి కాబోతున్నట్లు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. ఇక అప్పటినుంచి సినిమాలకే కాకుండా.. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. ఇటీవల వినాయక చవితి పూజలు చేస్తున్న ఫొటోలు షేర్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంది. కడుపుతో ఉంటే.. పూజలు చేయకూడదని కూడా తెలియదా అని నెటిజన్లు ఓ రేంజ్‌లో మాటలన్నారు. ఈక్రమంలో.. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చింది.

తాను నటించిన తమిళ మూవీ ‘తనల్’(thanal) నుంచి అప్డేట్ కూడా రాబోతున్నట్లు వెల్లడించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఆగస్టు 31న ‘తనల్’ ట్రైలర్ సాయంత్రం 6:01 గంటలకు రాబోతున్నట్లు లావణ్య ప్రకటించింది. ‘‘నొప్పి మిమ్మల్ని హీరోగా చేస్తుంది లేదా విలన్‌గా చేస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. లావణ్య సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి షాక్ ఇచ్చిందని అంటున్నారు. కాగా.. ఈ సినిమాతోనే లావణ్య తమిళ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో అథర్వ మురళి (Atharva Murali)హీరోగా నటిస్తుండగా.. రవింద్ర మాధవ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బోస్ వెంకట్, అశ్విన్ కకుమను, పెరుమల్, లక్ష్మి ప్రియ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story