Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి లేటెస్ట్ అప్డేట్!

by Dishanational2 |
Swayambhu:  నిఖిల్ ‘స్వయంభు’ నుంచి లేటెస్ట్ అప్డేట్!
X

దిశ, సినిమా: ‘కార్తికేయ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘స్వయంభూ’ ఒకటి. నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ ఇప్పటివరకు చూడనటువంటి సాలిడ్ మేకోవర్ చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ విపరీతమైన ట్రెండ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా నుంచి నిఖిల్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. భువన్, శ్రీకర్ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

Read More: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే హిందీ, కన్నడ సినిమాలు ఇవే..

Next Story

Most Viewed