వాళ్లిద్దరే నా ఆరాధకులు: Harnaaz ఎమోషనల్ నోట్ వైరల్

by Disha Web Desk 10 |
వాళ్లిద్దరే నా ఆరాధకులు: Harnaaz ఎమోషనల్ నోట్ వైరల్
X

దిశ, సినిమా: మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. అంతేకాదు USAలో జరిగిన మిస్ యూనివర్స్ 2022 ఫైనల్ ఈవెంట్‌లో మాజీ అందగత్తెలు లారా దత్తా, సుస్మితా సేన్‌ల ముఖ చిత్రాలను ముద్రించిన గౌనును ధరించి షోలో స్పెషల్‌గా కనిపించిన ఆమె.. 'నాకంటే ముందు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు. నా గొప్ప దేశానికి మిస్ యూనివర్స్‌ కిరీటం అందించడం గౌరవంగా ఉంది. నా లాస్ట్ వాక్ కోసం ఈ డ్రీమ్ ఫ్రాక్‌ను రూపొందించిన @officialsaishashinde బృందానికి కృతజ్ఞతలు. సుస్మితా సేన్, లారా దత్తాలను నిజంగా ఆరాధిస్తాను' అంటూ ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందించిన లారా దత్తా.. 'హర్నాజ్‌.. నువ్వు ఎల్లప్పుడూ వజ్రంలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి. నీకు శుభమే జరుగుతుంది' అంటూ తనదైన స్టైల్‌లో రిప్లయ్ ఇచ్చింది.

Also Read....

మా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు: స్టార్ నటి

Next Story