- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సరస్వతి’ కోసం రంగంలోకి స్టార్ హీరోయిన్.. మా క్వీన్ వస్తోందంటూ వరలక్ష్మి ఎమోషనల్ పోస్ట్..
ఒక సాధారణ మహిళ తన బిడ్డ కోసం చేసే పోరాటం, అన్యాయం జరిగినప్పుడు ఆమె ఎలా కాళీగా మారుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమా రాబోతోంది.

దిశ, సినిమా: నటిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar), ఇప్పుడు కెమెరా వెనుక నిలబడి అందరినీ ఆశ్చర్యపరచబోతున్నారు. ఆమె దర్శకత్వం వహిస్తూ, లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సరస్వతి’(Saraswati). ఒక సాధారణ మహిళ తన బిడ్డ కోసం చేసే పోరాటం, అన్యాయం జరిగినప్పుడు ఆమె ఎలా కాళీగా మారుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను సమంత విడుదల చేయగా, ట్రైలర్‌ను హీరో నాని లాంచ్ చేశారు. ఇప్పుడు మొదటి పాటను లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. మార్చి 1న ఉదయం 10.04 గంటలకు ఈ సాంగ్ మన ముందుకు రానుంది.
కేవలం వరలక్ష్మి మాత్రమే కాదు, ఇందులో ప్రియమణి, ప్రకాష్ రాజ్, రాధికా శరత్ కుమార్, మురళీ శర్మ వంటి దిగ్గజ నటులు నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వరలక్ష్మికి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే ఆమె దీనిని కేవలం ఒక సినిమాగా కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. అందుకే నయనతార ఈ పాటను లాంచ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ.. ‘‘నా క్వీన్ నయనతార గారు ఈ పాటను విడుదల చేయడం నాకు దక్కిన గౌరవం. నా పట్ల, ఈ మూవీ పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు మేడమ్’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కోర్ట్ రూమ్ డ్రామ థ్రిల్లర్ మూవీ మార్చి 6, 2026న థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. ‘దోస డైరీస్’ బ్యానర్‌పై వరలక్ష్మి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.






