నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు.. నా తల్లికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి.. ప్రముఖ నటి ఎఫైర్స్‌కు సపోర్ట్‌ ఇస్తున్న కొడుకు

by Sujitha Rachapalli |

కునికా సదానంద్ .. ఒకప్పుడు తన నటన, ర్యాప్ సాంగ్స్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. నెగెటివ్ క్యారెక్టర్స్‌తోనూ మెప్పించి వావ్ అనిపించింది. ఆ తర్వాత కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే సింగర్ కుమార్ సనుతో లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకున్నట్లు చెప్పింది.

నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు..  నా తల్లికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి.. ప్రముఖ నటి ఎఫైర్స్‌కు సపోర్ట్‌ ఇస్తున్న కొడుకు
X

దిశ, వెబ్ డెస్క్ : కునికా సదానంద్ .. ఒకప్పుడు తన నటన, ర్యాప్ సాంగ్స్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. నెగెటివ్ క్యారెక్టర్స్‌తోనూ మెప్పించి వావ్ అనిపించింది. ఆ తర్వాత కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే సింగర్ కుమార్ సనుతో లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకున్నట్లు చెప్పింది. 27ఏళ్ల వయసులో తను ఈ పని చేసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో తెలిపింది. కుమార్ సను తన భార్యతో విడిపోయాక.. షూటింగ్ జరుతున్న సమయంలో ఆత్మహత్యకు యత్నించాడని.. ఆయనకు ఆ సమయంలో ఎమోషనల్‌గా మద్దతిచ్చానని.. తర్వాత అది లివ్ ఇన్‌గా మారిందని తెలిపింది. కానీ తాను ఈ రిలేషన్ విషయంలో సీరియస్‌గా ఉంటే.. సింగర్ మాత్రం తనను మోసం చేశాడని, మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత అతని మొహం కూడా చూడాలనిపించలేదని బాధపడింది.

ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ 19లో కంటెస్టెంట్‌గా ఉన్న ఆమె క్యారెక్టర్ గురించి తోటి ఇంటి సభ్యులు కామెంట్స్ చేయడంతో వీకెండ్‌ కా వార్‌లో తన తల్లి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు కొడుకు అయాన్. కొడుకులను కాపాడుకునేందుకు తల్లిగా ఆమె పడిన కష్టాల గురించి వివరించాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె క్యారెక్టర్ గురించి ప్రశ్నించగా.. ఈ వయసులో నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు.. తన తల్లి యుక్తవయసులో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటని ప్రశ్నించాడు. యుక్తవయసులో ఇదంతా సహజమని సపోర్ట్ చేశాడు.

Next Story