- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుబేర’ థర్డ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఏడాది పుష్ప-2, ఛావా వంటి చిత్రాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఏడాది పుష్ప-2, ఛావా వంటి చిత్రాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’(Kubera). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనిని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అయితే ‘కుబేర’ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 20న విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన చిత్రబృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మూడో పాటను విడుదల చేశారు. పిపి.. డుండుండుం అని సాగే ఈ పాటను సింగర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత్ అందించారు. దీనికి చైతన్య పింగళి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌లో రష్మిక కాలేజీ అమ్మాయిలాగా సాధారణంగా చూడీదార్ ధరించి హాస్టల్‌లోని అమ్మాయిలతో చిందులేసింది. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ వీడియోను చూసిన నెటిజన్లు హిట్ అవడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుందని అంటున్నారు. మరికొందరు మాత్రం రష్మిక మెస్మరైజింగ్ లుక్‌కు ఫిదా అయ్యామని కామెంట్లు చేస్తున్నారు.






