నా కంటే స్టార్ కిడ్స్ గొప్పగా నటిస్తారా? కృతి సనన్ కామెంట్స్ వైరల్

by Kodari Anjali |   (  Updated:2023-07-27 13:43:30  IST  )

స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇండస్ట్రీలో నెపోటిజంపై ఇటీవల ఓ సమావేశంలో చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.

నా కంటే స్టార్ కిడ్స్ గొప్పగా నటిస్తారా? కృతి సనన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇండస్ట్రీలో నెపోటిజంపై ఇటీవల ఓ సమావేశంలో చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు కొన్ని సినిమాలకు మొదట తనను సెలక్ట్ చేసి ఆ తర్వాత స్టార్ కిడ్స్‌ను తీసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నా కెరీర్‌లో ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే వచ్చాయి. ఆ విషయంలో హ్యాపీ. అయితే సినిమా చాన్స్‌ల కోసం దర్శకనిర్మాతలను సంప్రదించడం నాకు నచ్చదు. వచ్చిన అవకాశాన్ని వంద శాతం వినియోగించుకుంటే చాలు అనుకుంటా. మనం కష్టపడితే ఆఫర్లు అవే వస్తాయని నమ్ముతా. అయితే నాకు వచ్చిన కొన్ని మంచి అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోయాయి. ఫస్ట్ నన్ను ఎంపిక చేసి తర్వాత స్టార్ నటుల పిల్లలను తీసుకున్నారు. అప్పుడు చాలా బాధపడ్డాను. నాకంటే వాళ్లు బాగా చేస్తారో లేదా ఇంకేదైనా కారణం కావొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయాపజయాలుంటాయి. ఏదైనా మన మంచికే’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.

Read More : మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఫస్ట్ సింగిల్

Next Story