'బోత్ ఆర్ ఆర్గానిక్'.. యంగ్ హీరోలపై Kriti Sanon ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web |
బోత్ ఆర్ ఆర్గానిక్.. యంగ్ హీరోలపై Kriti Sanon ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ కృతి సనన్ సహ నటులు వరుణ్ ధావన్ అండ్ కార్తీక్ ఆర్యన్‌లతో కలిసి పని చేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నవంబర్ 25న విడుదలైన 'భేదియా' చిత్రంలో వరుణ్ సరసన కీలకపాత్ర పోషించిన కృతి.. దీని తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న 'షెహజాదా' కోసం కార్తీక్ ఆర్యన్‌తో జతకట్టనుంది. ఈ క్రమంలో రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వ్యక్తిగత జీవితంలో వారిద్దరూ విభిన్న వ్యక్తులు. ఆలోచనలు, అభిప్రాయాల్లో తేడాలుంటాయి. కానీ, యాక్టింగ్ విషయంలో మాత్రం పోలికలున్నాయి. ఎందుకంటే వరుణ్, కార్తీక్ ఇద్దరూ చాలా నేచురల్‌గా యాక్ట్ చేస్తారు. అలాంటి వారితో కలిసి నటించే అవకాశం వెంటవెంటనే రావడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నా' అని తెలిపింది. అంతేకాదు వరుణ్ చాలా సరదాగా ఉంటే, కార్తీక్ బిగ్గరగా నవ్వుతుంటాడని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పుకొచ్చింది. ఇక తాను కూడా వృత్తి జీవితంలో గొప్ప దశను చేరుకుంటున్నట్లు వెల్లడించింది.

Read More: అది చూస్తే బాధగా అనిపించింది: రిచా కాంట్రవర్సీ ట్వీట్‌పై అక్షయ్

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed