- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవ్ బ్రేకప్‌పై ఓపెన్ అయిన కృతి శెట్టి.. షాకింగ్ కామెంట్స్ వైరల్
నా జీవితంలో ఒకసారి బ్రేకప్ జరిగింది. ఆ విషయం మా అమ్మకు కూడా తెలుసు.

దిశ, సినిమా: ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన కృతి శెట్టి, త్వరలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIk) సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రేజీ లవ్ స్టోరీలో కృతి సరసన ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితంలోని బ్రేకప్‌ల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో కృతి శెట్టి తన లవ్ లైఫ్ గురించి ఓపెన్ అయిపోయింది. "నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. కానీ గతంలో నా జీవితంలో ఒకసారి బ్రేకప్ జరిగింది. ఆ విషయం మా అమ్మకు కూడా తెలుసు.
ఇక సోషల్ మీడియా విషయానికొస్తే.. ఎవరైనా నా గురించి కావాలని నెగిటివ్‌గా ప్రచారం చేస్తే మాత్రం వెంటనే వారిని బ్లాక్ చేస్తాను" అంటూ క్లారిటీ ఇచ్చింది. కృతి చేసిన ఈ బ్రేకప్ కామెంట్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక హీరో ప్రదీప్ రంగనాథన్ తనదైన స్టైల్‌లో ఫన్నీగా స్పందించాడు. "నేను సింగిల్ అని చెప్పుకోవడానికే గర్వపడతాను. నా జీవితంలో ఒకటి కాదు, చాలా బ్రేకప్‌లు జరిగాయి. నేనైతే ఎవరినీ బ్లాక్ చేయలేదు కానీ, అవతలి వాళ్లే నన్ను బ్లాక్ చేశారు. ముఖ్యంగా నా కాలేజీ రోజుల్లో అమ్మాయిల మెసేజ్‌లకు నేను ChatGPT కంటే వేగంగా రిప్లై ఇచ్చేవాడిని" అంటూ నవ్వులు పూయించాడు. ఒకప్పుడు అంతలా రిప్లైలు ఇచ్చినా ఇప్పుడు మాత్రం సింగిల్‌గానే మిగిలిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.






