చివరి రోజుల్లో ఆ హీరోకు కోటా శ్రీనివాసరావు భారీ సాయం..!

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao) కొనసాగిన సంగతి తెలిసిందే. దాదాపు 750 కి పైగా

చివరి రోజుల్లో ఆ హీరోకు కోటా శ్రీనివాసరావు భారీ సాయం..!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao) కొనసాగిన సంగతి తెలిసిందే. దాదాపు 750 కి పైగా సినిమాలు చేసి... తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు దివంగత నటుడు కోట శ్రీనివాసరావు. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కలిసి కెరీర్ ప్రారంభించిన కోట శ్రీనివాసరావు... మొదట్లో చిన్న చిన్న పాత్రలు... ఆ తర్వాత విలన్ గా ఒదిగి పోయారు.

తదనంతరం... తండ్రి, మావయ్య, తాత ఇలా అనేక పాత్రల్లో కనిపించారు. రాజకీయ నటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో కనిపించి... మెరిశారు కోట శ్రీనివాసరావు. అయితే అలాంటి కోట శ్రీనివాసరావు నిన్న ఉదయం 4 గంటల సమయంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒకసారి. అయితే అలాంటి కోట శ్రీనివాసరావు... చనిపోయే ముందు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు.

అయినప్పటికీ ఓ మెగా హీరో కోసం... భారీ త్యాగమే చేశారట కోట శ్రీనివాసరావు. మెగాస్టార్ చిరంజీవితో కెరీర్ ప్రారంభించిన కోట శ్రీనివాసరావు... ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనే (Pawan Kalyan) కెరీర్ ఎండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన హరిహర వీరమల్లు సినిమాలో.. ప్రత్యేక పాత్రలో కోట శ్రీనివాసరావు కనిపించబోతున్నారట. తీవ్ర అనారోగ్యం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే ఆ సినిమాలో నటించారట కోట శ్రీనివాసరావు. కాగా ఈ సినిమా జూలై 24వ తేదీన విడుదల కానుంది.

Next Story