ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తున్న ఓ ఫుట్‌బాల్ ట్విట్టర్ ఎకౌంట్.. ఊహించని విధంగా రియాక్ట్ అయిన ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తున్న ఓ ఫుట్‌బాల్ ట్విట్టర్ ఎకౌంట్.. ఊహించని విధంగా రియాక్ట్ అయిన ఫ్యాన్స్
X

దిశ, సినిమా : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’.. ఆస్కార్‌తో సహా ఇంటర్నేషనల్ అవార్డులతో సత్కరించబడింది. ముఖ్యంగా నాటు నాటు పాటకు సూపర్ క్రేజ్ రాగా ‘కొమురం భీముడో’ పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చాలా మంది చెప్పారు. అయితే ఈ పాటను ‘ట్రోల్ ఫుట్‌బాల్’ అనే ట్విట్టర్ హ్యాండిల్.. హార్వర్ట్జ్‌ను చూసినప్పుడు అర్టెటా టెంపర్ లూజ్ కావడం, అతన్ని చితగొట్టేందుకు వెంటపడటాన్ని ట్రోల్ చేసేందుకు ‘కొమురం భీముడో’ పాటను వినియోగించారు. అయితే ఈ అంశంపై చాలా సీరియస్‌ అవుతారనుకున్న తారక్ ఫ్యాన్స్.. యంగ్ టైగర్ స్టార్‌డమ్ గ్లోబల్ లెవల్‌కు రీచ్ అయిందనడానికి ఇదే నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎదుటివాళ్లను ఏమనే ధైర్యం లేకనే పాపం ఎన్టీఆర్ అభిమానులు ఇంత సున్నితంగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అయితే ఈ వీడియో ట్రెండింగ్‌లోకి రాగానే వీడియోను డిలీట్ చేసింది సదరు ట్విట్టర్ హ్యాండిల్.



Next Story

Most Viewed