‘దేవర-2’ లో కోలీవుడ్ స్టార్ హీరో.. పోస్ట్‌తో సినిమాపై భారీ హైప్!

by Mallepaka Hamsa |

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది.

‘దేవర-2’ లో కోలీవుడ్ స్టార్ హీరో.. పోస్ట్‌తో సినిమాపై భారీ హైప్!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘డ్రాగన్’పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ షూట్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ ‘దేవర-2’ (Devara - 2)లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా గత ఏడాది విడుదలై సంచనాలు సృష్టించిన ‘దేవర’కు సీక్వెల్‌గా రాబోతుంది. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో ‘దేవర-2’ షూట్ మొదలు పెట్టాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీ ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ‘దేవర-2’ మూవీ టీమ్ ఆయనకు కథ వినిపించగా.. శింబు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

link

Next Story