కిరణ్ అబ్బవరం, నేహా ‘రూల్స్ రంజన్’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా?

by Disha Web Desk 6 |
కిరణ్ అబ్బవరం, నేహా ‘రూల్స్ రంజన్’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, డిజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి కలిసి నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. దీనిని డైరెక్టర్ ఏఎం రత్నం కృష్ణ తెరకెక్కించగా.. దివ్యాంగ్ లవానియా మురళీ కృష్ణ వేమూరి ఈ మూవీని నిర్మించారు.

తాజాగా, రూల్స్ రంజన్ సినిమా నేడు శుక్రవారం అక్టోబర్-6న థియేటర్స్‌లో విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ప్రివ్యూ షోలు చూసిన జనాలు సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. కొందరు ఫస్టాఫ్ అస్సలు బాగోలేదని, కామెడీ కూడా వర్కవుట్ కాలేదని అంటున్నారు. మరి కొందరు నెటిజన్లు మాత్రం బాగుందని కన్ఫమ్‌గా హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రూల్స్ రంజన్ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

Next Story

Most Viewed